Surrender Leave Rules in Telugu for AP Telangana State Government Employees Teachers
Surrender Leave Rules in Telugu for AP TS State Government Employees How to surrender Earned leaves Maximum days to surrender earned leaves Surrender Leave encashment and half pay leave surrender leave application form download Surrender Leave Rules in Andhra Pradesh and Telangana state government employees and teachers. Surrender Leave HRA
What is Surrender Leave
ఆర్జిత సెలవు ఖాతాలో నిలువ వున్నా సెలవును, కొన్ని పరిమితులకు షరతులకు లోబడి అప్పగించి (Surrender ) దానికి ప్రతిఫలంగా నగదు రూపేణా పొందుటకు ప్రభుత్వం ఉత్తర్వులు ద్వారా సౌకర్యం కల్పించింది.
Who is Eligible for Surrender Leave
ఆర్జిత సెలవు సరెండర్ చేయుటకు ఉద్యోగులను 3 వర్గాల వారీగా విభజించడం జరిగింది
- నాల్గవ తరగతి ఉద్యోగులు
- నాన్ గెజిటెడ్ ఉద్యోగులు
- గెజిటెడ్ ఉద్యోగులు
Surrender Leave Rules in Telugu and Complete Details
- ఏ ఏ వర్గాల ఉద్యోగులు ఏ ఏ నెలలో ఆర్జిత సెలవు సరెండర్ చేయవచ్చునో ప్రభుత్వం సమయ అనుసూచి నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
- కాని పదవీ విరమణ చేసే ఉద్యోగులకు సమయ అనుసూచికలో నిర్దేశించిన ముందు నెలలోనే ఆర్జిత సెలవు సరెండర్ చేసి నగదు చేసుకొనుటకు అనుమతించవచ్చును .
- ఒక ఉద్యోగి జూన్ 30వ తేదీ నాటికి ఆర్జిత సెలవు (Earned Leave )225 నుండి 240 రోజుల మధ్య నిల్వ ఉన్నట్లయితే అటువంటి వారికీ కూడా సమయ అనుసూచి కు ముందే అర్జిత సెలవు మంజూరు చేయవచ్చును . G.O.Ms.No.232, Dated:16-9-2005 ద్వారా ఆర్జిత సెలవు జమ గరిష్ట పరిమితి ని 240 నుండి 300 రోజులుగా పెంచుతు ఉత్తర్వులు జారీ చేసినందువలన 225 నుండి 240 రోజులు అను విషయములో వివరణ రావలసియున్నది.
- సరెండర్ సెలవు జీతం నెలవారీ పద్దతిపై ఇవ్వాలి. ఆ నెలలో గల 28/29/30/31 రోజులతో నిమిత్తం లేకుండా నెలవారీ పద్దతిపై నగదు చెల్లించాలి. ఈ విషయమై నెల అనగా 30 రోజులు మాత్రమే. (G.O.Ms.No.306 Fin తేది:08-11-1974).
- G.O.Ms.No.334 F&P తేది:28-09-1977 ద్వారా ఒక సవత్సరం సర్వీస్ పూర్తీ చేసినటువంటి రెగ్యులర్ ఉద్యోగులకు ప్రతి ఆర్ధిక సంవత్సరం (Financial Year ) 15 రోజుల చొప్పునగాని,2 సం॥ లకు 30 రోజుల చొప్పున గాని ఈ సెలవును సరెండర్ చేసి నగదు పొందవచ్చు.
Related Posts to read :
ఎవరు మంజూరు చేయాలి
- ఏ అధికారికైతే ఆర్జిత సెలవు మంజూరు చేయు అధికారం కలిగి వున్నాడో , అట్టి అధికారి సెలవు సరెండర్ చేయుటకు అనుమతించవచ్చు
సరెండర్ లీవ్ ఎప్పటి నుండి అనుమతించాలి
- Govt Memo No . 47064/1164/FRI /74-1-F & P Dept Dt. 25..09. 1974 ప్రకారం ఆర్జిత సెలవు సరెండర్ చేయుటకు ఉద్యోగి దరఖాస్తు చేసిన తర్వాత తేదీ నుండి మాత్రమే ఆర్జిత సెలవు సరెండర్ చేసుకొనుటకు అనుమతించాలి. అంతకు ముందు తేదీ నుండి అనుమతించకూడదు
ఆర్జిత సెలవు ఎప్పుడెప్పుడు సరెండర్ చేయవచ్చు
G.O.Ms.No.334 F&P తేది:28-09-1977 ద్వారా ఒక సవత్సరం సర్వీస్ పూర్తీ చేసినటువంటి రెగ్యులర్ ఉద్యోగులకు ప్రతి ఆర్ధిక సంవత్సరం (Financial Year ) 15 రోజుల చొప్పునగాని,2 సం॥ లకు 30 రోజుల చొప్పున గాని ఈ సెలవును సరెండర్ చేసి నగదు పొందవచ్చు.
తాత్కాలిక ఉద్యోగులకు సరెండర్ లీవ్
తాత్కాలిక ఉద్యోగులు అనగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లోని రూలు 10 (a ) (i ) ప్రకారం నియమితులైనవారు , ఆంధ్రప్రదేశ్ లాస్ట్ గ్రేడ్ సర్వీస్ రూల్స్ లోని రులు 7 (a ) ప్రకారం నియమితులైన నాల్గవ తరగతి ఉద్యోగులు, రెండు సంవత్సరములు సర్వీస్ పూర్తీ చేసుకున్న తర్వాతనే 15 రోజుల ఆర్జిత సెలవు సరెండర్ చేసుకొనుటకు అనుమతించవచ్చును. ఆ తరువువత సంవత్సరం (ఆర్ధిక సవంత్సరం) 15 రోజులు సరెండర్ చేసుకొనుటకు అనుమతించవచ్చును . అనగా సరెండర్ కు సరెండర్ కు మధ్య ఒక ఆర్థిక సంవత్సరం గ్యాప్ ఉండాలి .
- ఇతర రాష్ట్రాల నుండి లేక కేంద్ర ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ రాష్టానికి డిప్యుటేషన్ పై వచ్చిన ఉద్యోగులు కూడా సరెండర్ లీవ్ కు అర్హులు. కానీ అట్టివారికి డ్యూటీ పే మరియు అలవెన్సు మాత్రమే చెల్లిస్తారు .
- G.O MS 211 Fin Dept Dated 10.04.1972 ఉత్తర్వుల ప్రకారం ఇంటి అద్దె అలవెన్సు (H.R.A) లేక ఏ ఇతర Compensatory అలవెన్సు చెల్లించరు
ఆర్జిత సెలవు – సరెండర్ లీవ్ జమచేయు విధానం
Govt. Memo No 50798/1063/FRI/79-1, Dated 22.11.1979 ప్రకారం జనవరి ఒకటవ తేదీనగాని , జులై ఒకటవ తేదీనగాని ఆర్జిత సెలవు సరెండర్ చేసిన సందర్భాలలో ఆర్జిత సెలవు ఖాతాలో నుండి ముందుగా సరెండర్ సెలవును తగ్గించి ఆ తరవాతనే ఆర్జిత సెలవు జమ ను నమోదు చేయాలి
సరెండర్ లీవ్ సర్వీస్ బుక్ లో నమోదు చేయు విధానం
- ఆర్జిత సెలవును సరెండర్ చేసిన సందర్భాలలో పూర్తీ వివరములు ఉత్తర్వుల నెంబర్ తో సహా సంబంధిత ఉద్యోగి సర్వీస్ రిజిస్టర్ లో ఎర్రసిరాతో నమోదు చేయాలి.
- అలాగే సర్వీస్ రిజిస్టర్ లోని ఆర్జిత సెలవు పట్టికలో కూడ ఎర్రసిరాతో నమోదు చేసి అట్టేస్ట్ చేయాలి
ఇంటి అద్దె మరియు ఇతర అలవెన్సులు Surrender Leave
ప్రభుత్వ సర్కులర్ మెమో నేం 64861/797/FR1/711 Fin Dept తేదీ 14.07.1972 ప్రకారం సరెండర్ లీవ్ కు సంబందించిన సెలవు జీతము చెల్లించునప్పుడు ఇంటి అద్దె మరియు ఇతర Compensatory అలవెన్సులు కూడా చెల్లించాలి .
గవర్నమెంట్ క్వార్టర్లు – సరెండర్ లీవ్
- G.O Ms No 337 F&P (PWPC II) Dept, Dated 29.09.1994 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ క్వార్టర్లు లోను , నిర్ధేశిత క్వార్టర్లు లోను రెంట్ ఫ్రీ క్వార్టర్లు లో నివసిస్తున్నప్పటికి ఆర్జిత సరెండర్ చేయుటకు అనుమతించినతో ఇంటి అద్దె అలవెన్స్ కూడా చెల్లించవలెను
- అదే విధంగా G.O Ms 25 F&P (FWPC IV) Dept Dated05.02.1996 ప్రకారం అదనపు ఇంటి అద్దె (Additional HRA) చెల్లించవలసి ఉన్నది .
ఇంటీరియమ్ రిలీఫ్ in Surrender Leave
- Memo No.31948/398/PC.I/98-1, Fin.&Plg. Dept., Dt.12.08.1998 ప్రకారం ఇంటీరియమ్ రిలీఫ్ అనేది పే కాదు కావున సరెండర్ లీవ్ ని నగదుగా మార్చుకునే సందర్భాలలో ఐ.ర్ ని పరిగణనలోకి తీసుకోను వీలులేదు .
- ఇంటీరియమ్ రిలీఫ్ ని సరెండర్ లీవ్ శాలరీ లో చెల్లించడము జరగదు
సరెండర్ లీవ్ బిల్లు సమర్పించుటకు కాల పరిమితి
Govt.Memo.No.27/423/a2/FR-1/97-1.dt.18-8-97 ప్రకారం ఉద్యోగికి సరెండర్ లీవ్ మంజూరు అయినా తేదీ నుండి 90 రోజుల లోపల బిల్లు నగదు కొరకు సమర్పించవలెను . ఆర్ధిక సంవత్సరమని క్యాలెండరు సంవత్సరమని అడ్డు లేదు . 90 రోజుల లోపల బిల్లు సంబంధిత వారికి సమర్పించని యెడల సరెండర్ లీవ్ మంజూరు అనుమతి దానంతట అదే రద్దు అవుతుంది